calender_icon.png 27 August, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంజయ్.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు

27-08-2025 02:28:34 AM

- మఠంలో మీకు స్థిర నివాసం ఖాయం 

- 12 ఏళ్ల బీజేపీ, 18 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? 

- కేంద్రమంత్రిగా ఉండి రోహింగ్యాలపై మాట్లాడటం విచిత్రంగా ఉంది 

- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి ): కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి  సిద్ధంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు. ‘మీకు సన్యాసం ఖాయం.. మఠంలో స్థిర ని వాసం ఖాయం’ అని అన్నారు. 12 ఏళ్ల బీజే పీ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా అని మంగళవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. ‘మీరు కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రివనే సంగతి మర్చిపోవద్దు.

ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరగడానికి నేను సి ద్ధం? మీరు సిద్ధమా? కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయావో గుర్తు లేదా? స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదు. రాజకీయ సన్యాసం తీసు కోవడానికి బండి సంజయ్ సిద్ధంగా ఉండా లి. రాముడు, దేవుడు పేరు చెప్పకుండా, అయోధ్య అక్షింతలు అని ప్రచారం చేయకుండా గెలవగలవా? దేవుడు పేరు చెప్పుకు ని రాజకీయాలు చేసే మీరు.. కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజారాజేశ్వర దేవాలయ అభివృద్ధికి ఒక్క పైసా అయి నా ఇచ్చావా’ అని నిలదీశారు. 

‘కేంద్రమం త్రిగా తెలంగాణకు, కరీంనగర్‌కు ఏమి చేశా రో లెక్కలు చెప్పగలవా?  బీసీకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం అన్యాయం చేస్తున్నా  ఎందుకు ప్రశ్నిచండం లేదు? మతం పేరుతో గెలుస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతుంది మీరు కాదా? ముస్లిం పేరుతో బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. మీ పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు రి జర్వేషన్లు ఇస్తే లేనిది.. ఇక్కడిస్తే తప్పేంటి? అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు.

ఓట్ల చోరీపై రాహుల్ గాం ధీ నిర్ధిష్టంగా ఆధారాలతో నిరూపించడంతో సమాధానం చెప్పుకోలేక బీజేపీ పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు. యూరియా కొరతపై చొరవ తీసుకొని మాట్లాడలేని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం తెలంగాణ దౌర్భాగ్యమన్నారు. కేంద్ర హోం మంత్రి అయ్యి మీరే  రోహింగ్యాలు గురించి మాట్లాడితే ఎలా? ఇది విడ్డూరంగా ఉందన్నారు.  బీజేపీ పాలనలో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చిద్దామా అని  ప్రశ్నించారు.