24-09-2025 12:00:00 AM
కోదాడ, సెప్టెంబర్ 23 : కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట నియోజకవర్గాలకు చెందిన 12 మండలాల భవన నిర్మాణ కార్మికులు కోదాడ పట్టణం లో ఉన్న లేబర్ ఆఫీస్ ను మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్ మాట్లాడుతూ భవన నిర్మా ణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12 సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలను అందించాలన్నారు.
సంఘం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు యారవ శ్రీనివాస్, లకావత్ బాలాజీ నాయక్, జిల్లా సహా య కార్యదర్శి నాగలక్ష్మి, కమిటీ సభ్యులు గుంజ రవీందర్, వల్లెపు శ్రీనివాస్ , కొమర రాజు జంజనం కోటేశ్వరరావు, నూకల కృష్ణయ్య, మాదాసు సంగయ్య, కోలా ఆంజనేయులు, మొలకలపల్లి పద్మ పాల్గొన్నారు..