30-08-2024 01:53:23 AM
సిరిసిల్ల, విజయక్రాంతి: ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం ఏకాదశి సందర్భంగా గురువారం రాజరాజేశర సామివారికి లక్ష బిలార్చన చేశారు. ఉదయం గర్భాలయ ంలో సామివారికి మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. లక్ష బిలార్చన సందర్భంగా ఆలయంలో అభిషేకాలను రద్దు చేసి భక్తుల కు శీఘ్రదర్శనం అమలు చేశారు. ఆల యంలో శ్రావణమాసం సందర్భంగా భక్తులరద్దీ కొనసాగుతుంది.