calender_icon.png 23 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్

23-11-2025 12:00:00 AM

సిడ్నీ , నవంబర్ 22 : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఈ సీజన్‌లో తొలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ యువ షట్లర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో లక్ష్యసేన్ వరల్డ్ నెంబర్.6 చౌ టెయిన్ చెన్(చైనీస్ తైపీ)కు షాకిచ్చాడు.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత యువ సంచలనం 17 21 స్కోర్‌తో విజయం సాధించాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన తర్వాత లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకున్నాడు.ఆదివారం జరిగే ఫైనల్లో లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన యుషి టనాకతో తలపడతాడు. ఈ ఏడాది లక్ష్యసేన్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరినా రన్నరప్‌గా నిలిచాడు