calender_icon.png 23 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిల్ స్థానంలో కెప్టెన్ ఎవరో ?

23-11-2025 12:00:00 AM

వన్డే, టీ20 సిరీస్‌కు నేడు భారత జట్టు ఎంపిక

గుహావటి, నవంబర్ 22 : సౌతాఫ్రికాతో జరిగే వన్డే, టీ ట్వంటీ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. దీని కోసం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ గుహావటిలో భేటి కానుంది. టీ20 సిరీస్ జట్టులో పెద్దగా మార్పులకు అవకాశం లేకున్నా.. వన్డే జట్టు ఎంపిక క్లిష్టంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ శుభమన్ గిల్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ లేదు.

తొలి టెస్ట్ సందర్భంగా మెడనొప్పితో తప్పుకున్న గిల్ తర్వాత రెండో టెస్టుకూ దూరమయ్యాడు. ప్రస్తుతం జట్టు నుంచి గిల్‌ను రిలీజ్ చేయడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో గిల్ సౌతాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌లు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గిల్ స్థానంలో ఎవరికి తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ రేసులో ముందున్నట్టు సమాచారం. అలాగే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది.

ఈ సిరీస్ వరకూ హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌ను చేయొచ్చు. అదే సమయంలో పలువురు సీనియర్ ప్లేయర్స్ అందుబాటులో ఉండడంపైనా సందిగ్ధత నెలకొంది. హార్థిక్ పాండ్యా ఫిట్‌నెస్‌తో ఉన్నాడా లేదా అనేది తెలియడం లేదు. అలాగే ఆసీస్ టూర్‌లోనే గాయపడిన శ్రేయాస్ అయ్యర్ కనీసం మరో రెండు మూడు నెలలు ఆటకు దూరంకానున్నట్టు తెలుస్తోంది. ఇక బజీ షెడ్యూల్ నేపథ్యంలో స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారా లేక వన్డే సిరీస్ ఆడిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి మొదలవుతుంది.