10-01-2026 01:49:14 AM
అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన రష్యా
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన అంశాన్ని రష్యా సీరియస్‌గా తీసుకున్నది. అందుకు ప్రతీకారంగా రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని పశ్చిమ లివివ్ ప్రాంతంపై అత్యాధునిక హేజల్‌నట్ క్షిపణి ఒరెష్నిక్‌ను ప్రయోగించింది.
రష్యా ఆ ప్రాంతంలోని సహజ వాయువు నిల్వలపై దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా,మరో 22 మంది క్షతగాత్రులైనట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.