calender_icon.png 27 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న లంబాడీల ఆత్మగౌరవ సభ చలో మోతే

27-09-2025 12:13:50 AM

మోతే: ఈ నెల 30న మోతె మండల కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ పోస్టర్స్ ను  బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు భూక్య శంకర్ నాయక్  ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల పైన జరుగుతున్న కుట్రలు, అసత్యప్రచరాలను తిప్పి కొట్టేందుకు ఈనెల 30న మండల కేంద్రంలోని స్వస్తిక్ ఫంక్షన్ హాల్ లో జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని లంబాడి ఆత్మ గౌరవంపైన జరుగుతునటువంటి దాడులను, లంబాడి లను ఎస్టీలు కాదని చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు లంబాడీలు అధిక సంఖ్యలోతరలి  రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు భూక్య శంకర్ నాయక్ , మణికంఠ నాయక్, సురేష్ నాయక్, కోటినాయక్, లక్ష్మణ్ నాయక్, సంతోష్ నాయక్, సురేందర్ నాయక్  లంబాడా నాయకులు పాల్గొన్నారు.