calender_icon.png 27 September, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

27-09-2025 12:12:45 AM

నారాయణపేట . సెప్టెంబర్,26(విజయక్రాంతి) : ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల (గ్రామపంచాయతీ) 2025, రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆర్వోలు, ఏఆర్‌ఓలకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎన్నికల నిర్వహణపైశుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల బాలికల గురుకుల/ కస్తూర్బా పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, కావున ఆర్వోలు అత్యంత జాగ్రత్తగా తమ ఎన్నికల విధులను నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కరదీపికలో ప్రతి ఒక్క పేజీని తప్పకుండా చదవి, అర్థం చేసుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు.

పంచాయతీ రాజ్ చట్టం - 2018, అలాగే ఎన్నికల సంఘం హ్యాండ్ బుక్ లో నిర్దేశించిన సూచనల మేరకు విధులను జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, డీ ఈ ఓ గోవింద రాజులు, ఆర్వోలు, ఏఆర్ వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులుపాల్గొన్నారు.