calender_icon.png 22 November, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

22-11-2025 01:24:26 AM

గద్వాల, నవంబర్ 21 (విజయక్రాంతి) : పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో భూ-భారతి, మీ - సేవ దరఖాస్తులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎఫ్-లైన్ పిటిషన్లపై మండలాల వారీగా తహసిల్దార్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.  సమావేశంలో ఆర్.డి.ఓ. అలివేలు,  సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రామ్ చందర్, అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.