13-05-2025 12:44:16 AM
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్ జానీ
కోదాడ మే 12: కోదాడలో స్నూకర్ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీనివాస థియేటర్ ఎదురుగా గల మదర్ స్నూకర్ గేమింగ్ హబ్ నందు క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు.
క్రీడలు ఐక్యమత్యాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఒత్తిడి నుంచి బయటపడేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడల అభివృద్ధికి మాజీ కౌన్సిలర్ మదర్ చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ అన లిస్టు హరీష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంటి పులి వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు, స్వామి నాయక్, మదర్, యూసఫ్, బలేమియా, స్నూకర్ ప్లేయర్లు పాల్గొన్నారు.