calender_icon.png 9 August, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ శవానికి అంతిమ సంస్కారాలు

09-08-2025 12:28:36 AM

మానవత్వాన్ని చాటుకున్న పోలీస్

నాగర్ కర్నూల్ ఆగస్టు 8 విజయక్రాంతి: కేఎల్‌ఐ కాల్వలో కొట్టుకుపోతున్న ఓ అనాధ శవానికి పోలీసులు అంతిమ సంస్కారాలు చేపట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జి ల్లా వట్టెం గ్రామ శివారులోని కెఎల్‌ఐ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలు సు కున్న ఎస్త్స్ర శ్రీనివాసులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అనాధ శవంగా గుర్తించగా పిఎస్ పరిధిలోని కానిస్టేబుల్ జితేందర్ తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలునిర్వహించారు.