21-11-2025 01:16:22 AM
నేటి నుంచి టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): 2011 నుంచి ఇప్పటి వరకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) వివరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత టెట్ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. చాలా మంది వద్ద వివరాలు లేకపోవడంతో గత టెట్ పరీక్షల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. 21, 22న ఎస్జీటీ టీచర్‌లకు, 24, 25, 26వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎస్‌ఏ ఫలితాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ సామార్థ్యాలతోపాటు ఇతర అంశాలపై అధికారులు చర్చించనున్నారు.