calender_icon.png 21 November, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సల్స్ పట్ల సానుభూతి విడ్డూరం

21-11-2025 01:17:36 AM

బీజేపీ ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): పీసీసీ చీఫ్ మహేశ్ కుమా ర్ గౌడ్, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నక్సల్స్ పట్ల సానుభూతి చూపడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. వేలాది మం ది నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా? అని, ఎంతో మంది దళిత, గిరిజనులను ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్‌ది కాదా? అని ఆమె   గురువారం ప్రకటనను విడుదల చేశారు.

వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్ర లకు పోయినట్లుగా వారి తీరు ఉందని ఎద్దేవా చేశారు. చర్చలకు పిలిచి వివరాలు, స్థావరాలు తెలుసుకుని నక్సల్స్‌ను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దే అన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఎన్ కౌంటర్లకు మహేశ్ కుమార్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్, మాజీ స్పీకర్ శ్రీపాదరావులను హత్య చేసిన నక్సల్స్ ఈరోజు మహేశ్ గౌడ్‌కు దేశభక్తులుగా కన్పిస్తున్నారా? అన్నారు.