calender_icon.png 17 January, 2026 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

17-01-2026 02:57:43 AM

  1. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి హిందువులను టార్గెట్ చేస్తున్నాయి 
  2. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కుమార్  

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిజామాబాద్ ఎం పీ దర్మపురి అర్వింద్‌కుమార్ అన్నారు. కాం గ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు అత్యంత ప్రమాదరమైన స్టేట్మెంట్ అని ఆయన విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అర్వింద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ హిందువుల్లో కావాలనే భయం సృష్టిస్తున్నారన్నారు.

కాంగ్రెస్-, ఎంఐఎం కలిసి హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తున్నాయని, ప్రధానంగా పాతబస్తీ ప్రాంతంలో దేవాలయా లపై దాడులు పెరిగాయన్నారు. పోలీస్ వ్యవస్థ న్యూ ట్రల్‌గా కాకుండా రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని బలిచేస్తున్నారని, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఒకే విధా నం అమలుచేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. నిజామాబాద్ పేరు “ఇందూరు”గా మా ర్చడం మా అజెండా అని, ఇది రాజకీయ నిర్ణయం కాదు- చారిత్రక న్యాయ మన్నారు. కుటుంబ రాజకీయాల వల్లే బీఆర్‌ఎస్ పతనమైందన్నారు. కేటీఆర్‌కు ఇందూ రులో పోటీచేసే ధైర్యం ఉందా? తెలంగాణ భవన్‌లో కూర్చుని డైలాగులు కొట్టొద్దని హితవు పలికారు. తెలంగాణకు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమన్నారు.