calender_icon.png 17 January, 2026 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా మల్లన్న జాతర

17-01-2026 02:59:13 AM

ఐనవోలుకు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు

మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): జానపదుల జాతరగా తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు రెండు రోజులుగా లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. దండాలు మల్ల న్నా .. మమ్మేలు మల్లన్న అంటూ జాతరకు వచ్చిన భక్తులు స్వామిని వేడుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ వేడుకల సందర్భంగా జాతర ప్రాంగణం భక్తజన సందో హంతో నిండిపోయింది. శివసత్తుల పూనకాలతో భక్తి పారవశ్యం వెళ్లి విరిసింది.ఎల్లమ్మ దేవతకు మల్లికార్జున స్వామికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.

సంక్రాంతి పండగ రోజున అర్చకులు మల్లికార్జున స్వామికి ఉత్తరాయన పుణ్యకాలం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వ హించి బిల్వార్చనతో శివలింగాన్ని అలంకరించారు. మహా నివేదన, నీరాజనం, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. మల్లికార్జున స్వామి కి బంగా రు మీసాలు, వెండి కిరీటం, వెండి కవచం, సుగందాలు వెదజల్లే గజ పుష్పమాలతో ముస్తాబు చేశారు. మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో దేవుడి రథాన్ని టీస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ప్రారంభించారు.