19-08-2025 12:00:00 AM
టీపీసీసీ రాష్ర్ట లీగల్ సెల్ ఛెర్మైన్ పొన్నం అశోక్ గౌడ్
కామారెడ్డి, ఆగస్టు 18 (విజయ క్రాంతి) : న్యాయవాదుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని టిపిసిసి రాష్ర్ట లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి లీగల్ సెల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే కాకుండా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు.
డిసిసి లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ న్యాయవాద సమస్యలను పొన్నం అశోక్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, జ్యూడిషల్ కమిటీ ఏర్పాటు చేయాలనీ, న్యాయవాదుల మెడిక్లయిమ్ 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని, 41-ఎ సిఆర్పిసిని వెంటనే రద్దు చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ రావు, స్టేట్ లీగల్ సెల్ సోషల్ మీడియా ఇంచార్జి ముబిన్, పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఉమాశంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, శ్యాం గోపాల్ రావు, నర్సింహారెడ్డి, సిద్దారాములు, జడల రజనీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ లీగల్ సెల్ అధ్యక్షులు, నాలుగు జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.