calender_icon.png 10 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాత్రా స్థలానికి తప్పని తిప్పలు

08-08-2024 12:00:00 AM

దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలానికి నిత్యం వేలమంది భక్తులు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా వస్తుంటారు. రాష్ట్రంలో ఆదాయం బాగా ఉన్న ఆలయాల్లో ఇది కూడా ఒకటి. అయినప్పటికీ భద్రాచలం పట్టణం మాత్రం ప్రతి సంవత్సరం వరద సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. కొన్నేళ్ల క్రితం గోదావరికి ఉధృతంగా వరద వచ్చినప్పుడు పట్టణంలోని అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద తగ్గేదాకా ప్రజ లు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడపారు. ఆ సమయంలో పట్టణంలో పర్యటించిన గత ప్రభుత్వ మంత్రులు భద్రాచలానికి వరద ముంపును తప్పించడానికి గోదావరి వెంబడి కరకట్ట నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

కానీ, అది నెరవేరనే లేదు. తాజాగా ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదకు తోడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని అనేక ప్రాంతా లు జలమయ మయ్యాయి. రామయ్య ఆలయం పరిసర ప్రాంతాల వరకూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. పట్టణ జనాభాతో సమానంగా బయటినుంచి భక్తులు వచ్చే పరిస్థితి ఉన్నందున అదనపు సౌకర్యాల మాట దేవుడెరుగు కనీసం రోడ్లు, డ్రైనేజిలాంటి సమస్యలనయినా పట్టించుకుంటే బాగుంటుంది.

 రాజమన్నార్, మణుగూరు