calender_icon.png 2 January, 2026 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమాన నేతలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

02-01-2026 01:19:51 AM

చిట్యాల, జనవరి 1 (విజయ క్రాంతి):వారి  అభిమాన నేతలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను ఉరుమడ్ల  గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం తెలియజేశారు.  చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన సంవత్సరం  సందర్భంగా  శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

చిట్యాల లోని శ్రీ శ్రీ  కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా  ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా, సంతోషంగా జీవితం గడపాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు,

ఉరుమడ్ల మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, ఉరుమడ్ల గ్రామ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగొని నరసింహ గౌడ్, పొలగోని నరేష్ కుమార్ గౌడ్, డాక్టర్ పోలగొని రాజేష్ గౌడ్, గుత్తా రవీందర్ రెడ్డి, పల్లపు రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జన్నపాల రాము,పెండల ప్రభు కుమార్, పొలగొని దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.