calender_icon.png 2 January, 2026 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్ట దేవాలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

02-01-2026 01:18:38 AM

యాదగిరిగుట్ట, జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులకు పోటెత్తారు. స్వామి వారిని  మంత్రి పోన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ జాతీయ భద్రత మాస ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయని ఇందులో భద్రత అధికారులు, ప్రతి పౌరుడు ఈ రోడ్డు భద్రత మహోత్సవములో అవగాహన సదస్సులో పాల్గొనాలన్నారు.

ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థిని,  విద్యార్థి వారి తల్లిదండ్రుల వద్ద ఒక హామీ పత్రం లాగా ఈ రోడ్డు భద్రత నిబంధనలను పాటిస్తామని ఒక సైనేజ్ విధానం తీసుకురావాలన్నారు. అలాగే తెలంగాణలో ప్రమాదాల తీవ్రతనీ పూర్తిగా తగ్గించాలని, ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఈయానా వెంట పలువురు అధికారులు ఉన్నారు.