calender_icon.png 30 December, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో లీక్.. వీక్ వీరులు!

30-12-2025 01:31:07 AM

  1. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేయాలి
  2. బీజేపీ కొందరి నేతలను హెచ్చరించిన రాంచందర్ రావు
  3. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో బీజేపీ స్టేట్ చీఫ్ భేటీ 
  4. వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్న నితిన్ నబిన్ 

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బీజేపీలో కొందరు లీక్ వీరులు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద ర్ రావు సంచలన వ్యాఖ్యలుచేవారు. వారు వీక్ కాక తప్పదని హెచ్చరించారు. పార్టీ పట్ల క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హాని సోమవారం ఎన్.రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తు త రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావుకు నితిన్ నబి న్ సిన్హా భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణ, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడా నికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సమిష్టికృషితో అందరూ పనిచేయాలని, దీంతోనే మంచి ఫలితాలు సాధించవ చ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనంతరం ఎన్.రాంచందర్‌రావు మీడియా తో మాట్లాడుతూ...వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో బీజేపీ మరింత వేగం పుంజుకుంటుం దని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేలా కొత్త కొత్త అంశాలను కావాలనే తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలి

ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని రాంచం దర్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీకి రావ డం ఏదో గొప్ప విషయంలా చూపించడం సరికాదని తెలిపారు. కేసీఆర్ సభ కు రావడంపై గబ్బర్ సింగ్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లుగా హైప్ సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధ మని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తెలంగాణలో కూడా అమలవ్వాల్సిందేనని తెలి పారు. తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలకు సంబంధించిన అక్రమ ఓట్లు ఉన్నాయన్న విష యం వాస్తవమని పేర్కొన్నారు. అలాం టి దొంగ ఓట్లను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని, స్వచ్ఛమైన ఓటరు జాబితాల ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన అన్నారు.