30-01-2026 12:00:00 AM
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు సమక్షంలో భారీ చేరికలు
చుంచుపల్లి, జనవరి 29, (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుల సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 500. మంది గురువారం ఆయా పార్టీలను వీడి బీఆర్‌ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యంలో గాజుల రాజమ్ బస్తీకి చెందిన కార్యకర్తలు బీఆర్‌ఎస్ లో చేరారు. కొత్తగూడెం తెలంగాణ భవన్ లో వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కాపు సీతామహాలక్ష్మీ, బండారు రుక్మేందర్, నవతన్, మిట్టపల్లి కిరణ్, అనుదీప్, తురక రాంకోటి తదితరులు పాల్గొన్నారు.