calender_icon.png 30 January, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు

30-01-2026 12:00:00 AM

ములకలపల్లి, జనవరి 29 (విజయక్రాంతి): మండలంలోని మూకమామిడి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు గురువారం సాయంత్రం గల్లంతయ్యాడు. ప్రాజెక్టు సమీపంలోని మొగరాళ్ళగుప్ప గ్రామానికి చెందిన తానం రాజేషు గాళాలతో  చేపలు పట్టడానికి ప్రాజెక్టులో కి వెళ్ళాడు. ఇతను వేసిన గాలానికి బరువైన చేప చిక్కడంతో దానిని తీసే ప్రయత్నంలో ప్రమాదవ శాత్తు ప్రాజెక్టులో పడిపోయాడు.

పక్కనే ఉన్న స్నేహితుడు ఇతడిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ రాజేష్ నీటిలో మునిగిపోయాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ప్రాజెక్టు దగ్గరకు చేరుకునేసరికి రాత్రి సమయం కావడంతో గల్లంతయిన రాజేష్ కోసం స్థానిక గ్రామస్తులు ఈతగాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు ప్రాజెక్టు దగ్గరకు వచ్చి రాజేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.