calender_icon.png 30 October, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రోక్ లక్షణాలను త్వరగా గుర్తించండి

30-10-2025 01:43:15 AM

-వెంటనే స్పందించి జీవితాన్ని రక్షించండి

-కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో అవగాహన సదస్సు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేట్‌లో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్ట్రోక్ ప్రారంభ హెచ్చరి క సంకేతాలను గుర్తించి వెంటనే చర్య తీసుకోవాలని వైద్యులు కోరారు.మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ అడ్డంకి ఏర్పడినప్పుడు, మెదడు కణాలు కేవలం కొన్ని నిమిషాల్లో చనిపోతాయని, ఆ పరిస్థితుల్లో వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం వల్ల ప్రాణాలను రక్షించవచ్చు అని, జీవితాంతం అంగవైకల్యం బారిన పడకుండా నివారించవచ్చు అని చెప్పారు.

నడుస్తూ అకస్మాత్తుగా తల తిరగడం లేదా అస్థిరంగా అనిపించడం, ముఖం ఒక వైపు వంగిపోవడం లేదా నోటి మూలం త్రిప్పబడడం, ఒక చేతి లేదా కాలు బలహీనంగా లేదా భారంగా అనిపించడం, పైకి ఎత్తలేకపోవడం, మాటలలో స్పష్టత లేకపోవడం లేదా మాట్లాడటానికి ఇబ్బంది పడటం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. రెండు కళ్లలో చూపు మందగించడం లేదా పోవడం ఇతర లక్షణాల్లో తీవ్రమైన తలనొప్పి, గందరగోళం, అచేతనం, మూర్ఛలు, లేదా మాట అర్థం కాకపోవడం ఒక్కసారి ఉంటాయి ఉన్నాయి.

స్ట్రోక్ సమయంలో ప్రతి నిమిషం 12 మిలియన్ మెదడు కణాలు చనిపోతాయి. స్ట్రోక్ ప్రారంభమైన మొదటి 60 నిమిషాలు, అంటే గోల్డెన్ అవర్, మెదడు పనితీరును కాపాడటంలో దీర్ఘకాలిక వైకల్యాన్ని నివారించటంలో అత్యంత ముఖ్యమైన సమయం అని డాక్టర్ సి. హెచ్. గోపాల్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ పేర్కొన్నారు. సమయానికి గుర్తించి తక్షణ చికిత్స ప్రారంభిస్తే లక్షల సంఖ్యలో మెదడు కణాలను రక్షించవచ్చు మరియు శాశ్వత వికలాంగతను నివారించవచ్చు అని డాక్టర్ వినోద్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్, అన్నారు. క్లోట్-బస్టింగ్ మందులు లేదా మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి చికిత్సలు సమయానికి ఇవ్వగలిగితే మెదడుకు రక్తప్రవాహాన్ని పునరుద్ధరించవచ్చు అని డాక్టర్ నివేదిత సాయి చంద్ర, కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ ఈ సందర్భంగా తెలిపారు.