07-05-2025 12:37:45 AM
-ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్
-ముషీరాబాద్‌లో సద్భావన యాత్ర..
-పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
-పదవులు కావాలంటే దరఖాస్తు చేసుకోండి
-కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. మంగళవారం ముషీరాబాద్‌లోని కషీష్ ఫంక్షన్ హాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా పరిశీలకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సహ పరిశీలకులు సిద్దేశ్వర్, శోభారాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ పార్టీ సిద్దాంతాలను సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలనలో చేయలేని పనులను సీఎం రేవంత్‌రెడ్డి 16 నెలల్లోచేసి చూపించారని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుతూ ప్రజల ప్రశంసలు పొందుతుంటే ఇది చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టి సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అన్నారు. ఇందువల్లే ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను పార్లమెంటు సమావేశాలలో అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఇప్పటివరకు ఎలాంటిచర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకే దేశవ్యాప్తంగా జై బాపూ. జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమాలను చేపడుతూ రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కృషిచేస్తున్నదని తెలిపారు. రాబో యే జీహెఎంసీ ఎన్నికల్లో ఆరు డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేయాలన్నారు.
పదవులు కావాలంటే దరఖాస్తు చేసుకోండి: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
పదవులు కావాలంటే దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ సికింద్రాబాద్ జిల్లా పరిశీల కుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు. ప్రతి డివిజన్‌లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామన్నారు. పదవులు రాలేదని నిరాశపడవద్దని, అధిష్టానం తప్పనిసరి మీ కృషిని గుర్తించి పదవులు అప్పగిస్తుందన్నారు.
జీహెఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గం లోని అన్ని డివిజన్‌లను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ జిల్లాలోని 40డివిజన్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి తమసత్తాచాటే విధంగా పనిచేయాలన్నారు. అందుకు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ సిద్ధాంతాలు, ఆశయాలను గడగడపకు తీసుకెళ్లి పార్టీకి మరింత దగ్గరయ్యేలా విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్‌కుమార్‌యాదవ్, ముషీరాబాద్ డివి జన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఆర్ కల్పన యాదవ్, వాజీద్ హుస్సేన్, రాష్ర్ట నాయకులు వెంకటేష్, జీఎన్ కేశవ్, గుర్రం శంకర్, నియోజకవర్గం ఏ, బీ కమిటీ అధ్యక్షులు అంజియాదవ్, వీడీ కృష్ణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు నరేందర్, మాజీ అధ్యక్షుడు సంగపాక వెంకట్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, కార్యదర్శి రాజ్ప్, ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీకాంత్‌గౌడ్, బి -బ్లాక్ కమిటీ ఉపాధ్యక్షుడు పట్నం నాగభూషణం గౌడ్, ఉపాధ్యక్షుడు మేడి సురేష్ కుమార్, పార్టీ లీగల్ సెల్ రాష్ర్ట కన్వీనర్ సయ్యద్ మో హినొద్దీన్, నాయకులు లింగంగుప్తా, గజ్జల సూర్యనారాయణ, గోవింద్, బంటారం యా దగిరిగౌడ్, నరేందర్, జయకుమార్, మనోహర్‌సింగ్, కవిత తదితరులు పాల్గొన్నారు.