calender_icon.png 12 September, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్‌గా ఉపయోగిద్దాం!

10-08-2024 12:00:00 AM

పెద్దలకైనా, పిల్లలకైనా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం తప్పనిసరైంది. కడుపునకు తిండి, కంటికి నిద్ర అక్కర్లేదన్నట్టుగా ప్రతి ఒక్క రూ ఫోన్లలో తలమునకలవుతున్నారు. ఫలితంగా అవసరం కన్నా ఎక్కువగా సెల్‌ఫోన్ అనర్థాలను కొని తెచ్చుకోవడమే జరుగుతున్నది. పెద్దల సంగతేమో కానీ, చిన్నారుల పాలిట ఇది ప్రమాద కరమవుతున్నది. మారాం చేస్తున్నారనో, అన్నం తినడం లేదనో పిల్లలకు సెల్ ఇస్తూ వారి జీవితాన్ని చీకటి చేస్తున్నామనేది పెద్దలు గమనించడం లేదు. జారుడు మెట్లలా స్మార్ట్ ఫోన్లు పిల్లల జీవితాన్ని అగాథంలోకి నెట్టేసే ప్రమాదం ఉంటుంది. తెలిసీ తెలియని వయసులో ఎంతోమంది చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు బానిసల వుతున్నా రు. కలర్‌ఫుల్ బొమ్మలు, వీడియో గేమ్స్, యానిమేషన్స్ చూడడానికి ఆనందంగానే ఉన్నా పొద్దస్తమానం వాడకం వల్ల పిల్లల కంటి చూపు పోయే విపత్తు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో సోషల్ మీడియా వాడకం గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వినియోగంలో భారతదేశం వాటా 32.2 శా తం. అంటే, సుమారు 46 కోట్లమంది మన దేశంలో సెల్‌ను వినియోగిస్తున్నారు. ఒక రకంగా స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి అవస రమే. ఆధునిక టెక్నాలజీ సహాయంతో అన్ని పనులు చకచకా చేసుకుంటున్నారు యూజర్స్. అయితే, ఇదే కాలక్షేపంగానూ మారుతు న్నది. ఎంతలా అంటే అవసరానికి మించి, ఎక్కువగా దానికి అడిక్ట్ అయ్యేలా! యంత్రాలు ఏవైనా మన నియంత్రణలో ఉండాలి. కానీ, వాటికి మనం బానిసలం కాకూడదు. రోజులో సెల్‌ఫోన్ వాడకాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ పోవడం మంచిది. తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. చాలామంది నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి దాకా సెల్‌ఫోన్‌తోనే గడిపేస్త్తున్నారు.

ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫేస్‌బుక్, వాట్సప్‌సహా కొన్ని సోషల్ మీడియా యాప్స్, ఈమెయిల్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి రోజులో ఏదో ఒక టైం పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే ము ఖ్యమైన వార్తల అప్‌డేట్స్ కోసం నిత్యం ఫోన్ చూడకుండా కాసేపు వాటిని పక్కనపెట్టి మన అభిరుచులపై దృష్టి పెడదాం. చిన్నపిల్లలను స్మార్ట్ ఫోన్‌కు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. వారు ఏ యాప్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకొని పక్కదారి పట్టకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే. టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా యా ప్స్‌లో అభ్యంతరకర పోస్టులు చేయకుండా, చూడకుండా జాగ్రత్త పడాలి. సెల్‌ఫోన్ అనర్థాలను అర్థమయ్యేలా వివరించాలి. 

 మోటె చిరంజీవి