calender_icon.png 22 August, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరం సమిష్టిగా కృషి చేద్దాం

22-08-2025 12:00:00 AM

  1. మాదకద్రవ్యాల రవాణా అరికట్టేందుకు విస్తృతస్థాయి తనిఖీలు చేయాలి
  2. మాదకద్రవ్య రహితగా జిల్లాగా తీర్చిదిద్దుదాం..
  3. కళాశాలలు, మెడికల్ షాపుల పరిసరాల్లో ప్రత్యేక నిఘా 
  4. కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు జిల్లాలో విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఎస్.పి. కాంతిలాల్ సుభాష్,  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏఎస్‌పి చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై నషా ముక్తి భారత్ అభియాన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ముఖ్యంగా మారుమూ ల గ్రామాలు, గుట్టలు, అటవీ ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నారని, నివారించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించి సం బంధిత భూ యజమానులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వము నుండి వస్తున్న రాయితీలను రద్దు చేయాలని తెలిపారు.

వ్యవసాయ శాఖ అధికారులు పంట చేనులలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించి గంజాయి సాగుకు పాల్పడుతున్నట్లయితే పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఆటో, లారీడ్రైవర్లపై నిఘా ఉంచాలని, గంజాయి రవాణా జరగకుండా విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహిం చాలని తెలిపారు. విద్యాలయాలకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి పాన్ టేలాలు ఉండకూడదని, పొగాకు పదార్థాలు విక్రయాలు జర గకుండా చర్యలు తీసుకోవాలని, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని తెలిపారు.

కళాశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, మెడికల్ షాపులలో మత్తు పదార్థాలను విక్రయించకుండా తనిఖీలు నిర్వ హించాలని, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గంజా యి రవాణా జరుగకుండా ఆర్ టి సి, రైల్వే పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు, ప్రజలకు గంజాయి సేవించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలపై కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి మాదకద్రవ్యాల రవా ణా జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాదక ద్రవ్యాలకు బానిస అయినవారికి చికిత్స కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెల చివరి బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో సమావేశం ఉంటుందని, జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగం జరగకుండా అందరం సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా మధ్య నిషేధశాఖ అధికారి జ్యోతి కిరణ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా రవాణా అధికారి రామ్ చందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.