24-12-2025 12:18:13 AM
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ సమక్షంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా అప్పాయిపల్లి గ్రామ సర్పంచ్ నజీర్, ఉప సర్పంచ్ చందు, మాచన్పల్లి గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, రేగడి గడ్డ తాండా సర్పంచ్ వెంకట్ నాయక్, ఉప సర్పంచ్ రాములు నాయక్, బిఆర్‌ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, అప్పాయిపల్లి మాజీ సర్పంచ్ ఊషన్న, మాజీ వార్డు సభ్యులు మరియు పలువురు కార్యకర్తలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్,
టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, శేఖర్ నాయక్, లింగం నాయక్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, సిజే బెనహార్, ఏర్పుల నాగరాజు, ఐఎన్టీయుసి రాములు యాదవ్, ఫయాజ్, అజ్మత్ అలి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.