24-12-2025 02:05:14 AM
ఉపసర్పంచ్ పదవిని వదులుకున్న చందర్
గుండాల, డిసెంబర్ 23 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండ కొత్తపల్లి గ్రామ ఉప సర్పం చ్‌గా మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన రస్తాపురం చందర్.. సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. అంగీకారపత్రాన్ని ఎంపీడీవోకు సమర్పించారు. ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నట్టుగా ఎంపీడీవో మీడియాకు తెలిపారు. కాగా రాజీనామా పలు అనుమానాలకు దారి తీస్తున్నదని గ్రామస్థులు అంటున్నారు.