calender_icon.png 2 December, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతో ఎయిడ్స్‌ని నిర్మూలిద్దాం

02-12-2025 01:22:38 AM

డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ అనిత పిలుపు

మంచిర్యాల, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : అవగాహనతోనే ఏయిడ్స్ ని నిర్మూలించవచ్చునని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్ట ర్ అనిత పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వినోత్సవాన్ని పురష్కరించుకొని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఔట్ రీచ్ వర్కర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావే శంలో డీఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడారు. దేశంలో 2019 మద్య హెచ్‌ఐవీ, ఏయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయన్నారు.

అయినప్పటికి వ్యాధి పట్ల అవగాహన కల్పించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం హెచ్‌ఐవీ, ఏయిడ్స్ పట్ల అవగాహన కల్పించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో కృషి చేసిన ఉద్యోగులకు ఉత్తరు ఆవార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్ట్ వేదవ్యాస్, ఆర్ ఎంఓలు జి. భీష్మ, శ్రీధర్, శ్రీమన్నారాయణ,హెచ్‌ఐవీ, ఏయిడ్స్ ప్రోగ్రాం అధికారులు శ్రీరాం, సుధాకర్ నాయక్, ఎంహెచ్‌ఎన్ ప్రోగ్రాం అధికారి కె. అరుణశ్రీ, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేష్, డెమో భుక్యా వెంకటేశ్వర్లు, సిహెచ్‌ఓలు నాందేవ్, వెంకటేశ్వర్, సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, నరేందర్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణ, లింగ్ వర్కర్లు, నర్సింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.