02-12-2025 02:16:29 AM
రామయంపేట, డిసెంబర్ 1 :రామాయంపేట పట్టణంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టన్న ముదిరాజ్ 16వ వర్ధంతి కార్యక్రమం రామాయంపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాల సన్నిధిలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్ లు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెట్టు గంగారం, దామోదర్, దేమె యాదగిరి, ఎనిశెట్టి అశోక్ లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదని, తెలంగాణను సాధించుకోవాలని, తెలంగాణ నుంచి తరలిపోతున్న నీళ్లు, నియామకాలు,
నిధులు మన రాష్ట్రానికి రావలసిన పూర్తి మొత్తంలో మనకే చెందాలని కోరుతూ కానిస్టేబుల్ కిష్టన్న తన గన్నుతో తనను తాను కాల్చుకొని జై తెలంగాణ అనే నినాదం మారు మ్రోగేలా తుది శ్వాస విడిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోటి యుగంధర్ రావు, సుందర్ సింగ్, పోచమ్మల సిద్దరాములు, తొంటవాలి యాదగిరి, రాము, సురేష్ నాయక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.