02-12-2025 01:21:30 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ ౧ (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట లో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరుపున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఇద్దరు విద్యార్థిణిలు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 10 వ తరగతి వరకు ట్రైబల్ మోడల్ క్రీడా పాఠశాలలో చదివిన విద్యార్థులు కళాశాలలో చేరి విద్యతోపాటు క్రీడల్లో రాణించ డం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారుల ను ఖోఖోలో తీర్చి దిద్దుతున్న ఖో ఖో కోచ్ తిరుమల్‌ను, క్రీడాకారిణిలను డివైఎస్‌ఓ అష్ఫాక్ అహమ్మద్, కోచ్‌లు సాగర్, అరవింద్ ,రవికుమార్, రాకేష్,యాదగిరి, శ్రీనివాస్, సం తోష్, అధ్యాపక బృందం అభినందించారు.