calender_icon.png 12 September, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాం ఏచూరి స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుదాం

12-09-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్

అదిలాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కామ్రేడ్ స్వర్గీయ సీతారాం ఏచూరి చూపిన పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణపై పోరాడాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో సీపీఎం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వర్గీ య సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.

అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ... సీతారాం ఏచూరి విద్యార్ధి దశ నుండే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. భార త రాజకీయాల్లో అనునిత్యం ప్రజాపక్షం వహిస్తూ అనేక పోరాటాలను నడిపారని గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని భార త రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై సైద్ధాంతికంగా పోరాడుతూనే దేశంలోని లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసే పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని, ఆయన స్పూర్తితో  ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించాలని అన్నారు.

లౌకిక ప్రజాస్వామ్య రక్షణకై పోరాడటమే ఏచూరికి నిజ మైన నివాళి అందుకు పార్టీ శ్రేణులు కృషి చెయ్యాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంకా రాఘవులు, అన్నమొల్ల కిరణ్, నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, స్వామి, నాయకులు పాల్గొన్నారు