31-01-2026 01:55:56 AM
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్న ఎంపీ, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులతో స్వల్ప వివాదం నెలకొంది. శుక్రవారం నామినేషన్ కేంద్రానికి వచ్చిన బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడం ఈ వివాదానికి దారితీసిం ది. పార్టీ కండువాలతో లోనికి వెళ్లొద్దని చెప్పడంతో పోలీసులతో ఎంపీ, ఎమ్మెల్యే స్వల్పం గా వాగ్వివాదానికి దిగారు.
రాష్ట్రమంతటా పార్టీ కండువాలతో అభ్యర్థులను లోనికి అనుమతిస్తుంటే.. ఆదిలాబా ద్లో అందుకు భిన్నంగా వ్యవహరించడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ప్రత్యేకాధికారి రాజేశ్వర్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన ఫలితం లేకపోయింది. దీంతో కండువాలు తీసి, ఫోన్ లను బయటే అప్పగించి అభ్యర్థులతో వారు లోనికి వెళ్లడంతో వివాదం సద్దముణిగింది. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే లు మాట్లాడుతూ.... ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, పలువురు నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.