02-01-2026 12:10:16 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౧ (విజయక్రాంతి): ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా ఎస్.పి. నితిక పంత్, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్‌లతో కలిసి రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా తొలిరో జు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ నియమాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ఉద్యోగులు, అధికారులతో రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేయించి సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శంకర్ నాయక్, రవాణా శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.