calender_icon.png 13 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన ప్రాంతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం

13-05-2025 12:20:42 AM

నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్

మహబూబ్ నగర్ మే 12 (విజయ క్రాంతి) : మన ప్రాంతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బా ధ్యత మనందరిపై ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆ నంద్ గౌడ్ అన్నారు. పట్టణం లో మునప గుట్టలో నూతన సిసి రోడ్ పనులను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో శిశీలన ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓ గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆ లక్షల కనుగుణంగా మనమందరం అండగా ఉందామని పిలుపునిచ్చారు. వార్డుల్లో అవసరమైన సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి ప్రతి సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ గోవింద్, చిన్న, తాటి గణేష్, శ్రీనివాస్ గౌడ్, సూర్యచందర్, శ్రీహరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్, పాండు, బాసిత్,  కాలనీవాసులు పాల్గొన్నారు.