13-05-2025 12:21:26 AM
- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- వైభవంగా మొదలైన ఎల్లమ్మ మహాజాతర
హుస్నాబాద్, మే 12 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ ఆల యం వద్ద ఏటా కనిపించే జానపదుల సాం స్కృతిక వైభవం ఈసారి మరింత శోభను సంతరించుకుంది. వైశాఖ మాస శుద్ధ పౌర్ణ మి నుంచి నెలరోజులపాటు జరిగే ఎల్లమ్మ మహాజాతర అట్టహాసంగా మొదలైంది. ఉ త్సవ కమిటీ సభ్యులు సోమవారం వేకువజామునే లందగోలెం, బొడ్రాయికి మొక్కు కొని వేడుకలు మొదలు పెట్టారు.
గౌడ కులస్తుల నుంచి ఘటాన్ని తీసుకొచ్చారు. సంప్ర దాయం ప్రకారం అమ్మవారికి బాసికాలు కట్టడంతోపాటు అర్చకులు బోనాలు సమర్పించారు. కిన్నెర పంబాలవారు పట్నాలు వేసి, కథ చెప్పారు. రవాణా, బీసీ సంక్షేమ శా ఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అ మ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని మహాముని కల్యాణ మహోత్సవంలో అమ్మవారికి బాసికాలు కట్టే వేడుకకు ప్రజలు వేలాదిగా వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక చింతనతో పట్టణమంతా నిండిపోయింది.
ఎల్లమ్మతల్లి కొంగుబంగారం : మంత్రి
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ‘హుస్నాబాద్ ప్రజలకు ఎల్లమ్మ తల్లి కొంగుబంగారం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చే సింది‘ అని అన్నారు. కాకతీయుల కాలం నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వరకు ఎల్లమ్మ తల్లి చరిత్రను ఆయన గుర్తు చేశారు. ‘హుస్నాబాద్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాల తో ఉండాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నాను. అని అన్నారు.