02-12-2025 01:25:00 AM
పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపు
ఆదిలాబాద్, డిసెంబర్ ౧ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నేరడిగొండ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడి గొండ మండలాల నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడు తూ.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచాలన్నారు. పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడాలని, పార్టీలోనీ నాయకులు విభేదాలు పెట్టుకోకుండా గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండాగా పని చేయాలని సూచించారు. సమావేశంలో పలువురు పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.