02-12-2025 02:20:00 AM
పోలీసుల సహకారంతో ఆక్రమణాల కూల్చివేత
కామారెడ్డి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి వీక్లీ మార్కెట్ రోడ్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసిన వారిపై. మున్సిపల్ అధికారులు కొరడా జూలీపించారు. సోమవారం ఉదయం ఐదు గంటల నుండి కబ్జాలలో ఉన్న వారికి గతంలోని నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తెలిపారు.
అయినప్పటికీ కబ్జా నుండి వెళ్లకపోవడంతో పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు జెసిబిల ద్వారా అక్రమ కట్టడాలను తొలగించారు. అక్రమ ఇసుక డంపులను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా షెడ్డులు ఏర్పాటు చేసి కబ్జాలకు పాల్పడినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కబ్జా లో ఉన్న స్థలాలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
పట్టణంలోని వీక్లీ మార్కెట్ సర్వేనెంబర్ ఆరులో గల వాటిని అక్రమ కట్టడాలను జెసిబిలా సాయంతో కూల్చివేశారు. సర్వే నంబర్ ఆరులో ఇసుక కుప్పల అమ్మకాలు కల్లు కంబౌండ్ ఇతర వ్యాపారుల కోసం నిర్మించిన వాటిని అక్కడ కొందరు కొన్ని సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నారు.
మున్సిపల్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయగలరని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జెసిబి లను తెచ్చి పోలీసుల బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు తమ జీవనోపాధి కల్పిస్తున్న ఇసుక డంపులను చుట్టూ ఉన్న ప్రహరీ గోడలను తొలగించారని బాధితులు వాపోయారు. మున్సిపల్ అధికారులు చెబుతున్నట్లు నోటీసులు తమకు జారీ చేయలేదని కనీసం తొలగిస్తామని కూడా చెప్పలేదని వారు తెలిపారు.