calender_icon.png 2 December, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటికీ బీఆర్‌ఎస్ వెంటే ప్రజలు

02-12-2025 01:26:07 AM

  1. ఎమ్మెల్యే కోవ లక్ష్మి

గులాబీ పార్టీలో భారీ చేరికలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ ౧ (విజ యక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నేటికీ ప్రజలు బీఆర్‌ఎస్ వెం టే ఉన్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాడిబండ, రౌట సంకేపల్లి గ్రామాల చెందిన దాదాపు 300 మంది మాజీ సర్పంచ్ కిష్టయ్య, వామన్ ఆధ్వర్యంలో కోవలక్ష్మి సమక్షంలో గులాబీ కండు వా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో  కేసిఆర్  ప్రజల గుండెల్లో  నిలిచిపోయారని తెలిపారు. సర్పం చ్ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.