calender_icon.png 13 August, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాల కోసం అడవినీ రక్షించుకుందాం

30-11-2024 10:35:15 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): అడవిని రక్షించుకొని భావి తరాలను కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి అటవీ రక్షణ కమిటీ సమావేశానికి జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, అదనపు ఎస్. పి. ప్రభాకర్ రావు, రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి పోలీస్, రెవెన్యూ, అటవీ, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ భావి తరాలకు ముఖ్యమని, ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా అటవీ సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అడవులను రక్షించాలని, అక్రమ ఆక్రమణ జరగకుండా కాపాడాలని, అక్రమ స్మగ్లింగ్ అరికట్టాలని అన్నారు. విద్యుత్ తీగలను అమర్చి వన్య ప్రాణులకు హాని కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటవీ ప్రాంతంలో పంటలను కాపాడుకోవడానికి రెైతులు విద్యుత్ తీగలను అమర్చడంతో కొన్ని సందర్బాలలో రైతులు, కూలీలకు హాని కలుగుతుందని, నియంత్రణ దిశగా చర్యలు తీసుకొని రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పులులు సంచరిస్తున్నందున అప్రమత్తత చర్యలు తీసుకోవాలని, వాటి బారిన ప్రజలు పడకుండా అవగాహన కల్పించాలని తెలిపారు.

డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అడవిలో ఆకుల వలన మంటలు వ్యాపించి చెట్లు కాలిపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. వెదురు మొక్కలను పెంచేందుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని, పశువుల మేత కొరకు అడవిలో అనువైన స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డి.ఎస్.పి. కరుణాకర్, జిల్లా గ్రామీణాభిృద్ధి అధికారి దత్తారాం, అదనపు గ్రామీణాభిృద్ధి అధికారి రామకృష్ణ, జిల్లా పశు సంవర్దక అధికారి సురేష్, తహసిల్దార్లు, ఎఫ్. ఆర్. ఓ.లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.