03-05-2025 12:00:00 AM
కార్యకర్తలు కష్టపడి పని చేయాలి: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేద్దామని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.
శుక్రవారం పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా పరిశీల కులు చంద్రశేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్య కలిగించి ప్రయోజనం పొందేలా ప్రతి కార్యకర్త కష్టప డి పని చేయాలని అటువంటి వారికి భవిష్య త్తులో రాజకీయ పదవులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు నర్సా గౌడ్ రమణా రెడ్డి శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.