calender_icon.png 27 October, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్‌పై అవగాహన కోసం కలిసి నడుద్దాం

27-10-2025 12:00:00 AM

-ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది

-జెమ్‌కేర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జెమ్‌కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ఖమ్మం (ఆరోగ్య హాస్పిటల్  ప్రాంగణంలో) ఆదివారం క్యాన్సర్‌పై అవగాహన నడక నిర్వహించారు. ఉదయం 6 గంటలకు  ఎన్టీఆర్ విగ్రహం, లక్కారం ట్యాంక్‌బండ్ నుండి ప్రారంభమై 3 కిలోమీటర్ల మేర కొనసాగిన నడక ఐటీ హబ్ వరకు వెళ్లి  తిరిగి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముగిసింది.

ముందస్తు పరీక్షలు, స్క్రీనింగ్, క్యాన్సర్ తొలిదశలో గుర్తిం పు ప్రాముఖ్యతలను వివరిస్తూ ప్రజలలో అవగాహనా పెంచడమే  ముఖ్య ఉద్దేశంగా ఈ వాక్‌ను నిర్వహించామని జెమ్ కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె సుధాకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల కావడం, ప్రత్యేకంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంపొందిస్తూ  అన్ని రకాల క్యాన్సర్లపై అవగాహన అవసరమని కూడా గుర్తుచేశారు.

ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, అవగాహన లోపం  వైద్యులను సమయానికి సంప్రదించకపోవడం వలన చాలామంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, నేటి ఆధునిక వైద్యరంగ పురోగతితో కాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయగలుగుతున్నామని డాక్టర్ సుధాకర్ వివరించారు. సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నుక్కసాని సుబ్బారావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వి మారుతి శంకర్‌రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె మోహన్‌రెడ్డి, సీనియర్ న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ సుబ్రమణియం ఎన్, అంకోప్యాథల జిస్ట్  డాక్టర్ అమృత జి లు వాక్ లో పాల్గొని మాట్లాడుతూ.. “అవగాహన లేమితో ఇప్పటికీ చాలామంది రోగు లు మూడో లేదా నాలుగో దశలో మాత్రమే ఆసుపత్రులకు వస్తున్నారు.

దీంతో చికిత్స కష్టతరమవుతుంది. ఖమ్మం పరిసర జిల్లాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి లేకపోవడంతో, రోగులు ఇప్పటివరకు హైదరా బాద్ లేదా విజయవాడకు వెళ్లి చికిత్స పొందాల్సి రావడాన్ని దృస్థి లో పెట్టుకొని, జెమ్‌కేర్ సంస్థ,  జెమ్‌కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను ఖమ్మంలో  స్థాపించమని, ఇందు లో అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు, చికిత్సలు అందించే సమగ్ర కేంద్రంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ప్రతి మహిళ 20 ఏళ్ల వయసు నుండి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గురించి తెలుసుకొని, ఇంట్లోనే స్వీయ పరిశీలన చేసుకోవడం  అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా  4డీ ట్రూ బీమ్ థెరపీ మెషిన్ ను జెమ్‌కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ఖమ్మం (ఆరోగ్య హాస్పిటల్  ప్రాంగణంలో) అందుబాటులోకి తెచ్చిందన్నారు. అదేవిధంగా అధునాతన  పెట్‌సిటీ (PET-CT) స్కాన్  ద్వా రా ఖచ్చితమైన నిర్ధారణతో  వైద్యులు ఖచ్చితత్వంతో చికిత్సను అందించగలుగుతారని డాక్టర్ సుధాకర్ అన్నారు.