calender_icon.png 27 October, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమ్ము క్యాన్సర్‌పై పింక్ పవర్

27-10-2025 12:00:00 AM

-అవగాహన పుస్తకాన్ని రాసిన యశోద హాస్పిటల్స్

-హైటెక్ సిటీ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్‌గౌడ్ 

-ఆవిష్కరించిన మంత్రి సీతక్క, సినీ నటి శ్రీలీల

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఆంకాలజీ క్యాన్సర్ చికిత్సా వైద్య రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్‌గౌడ్ రొమ్ము క్యాన్సర్ స్క్రీనిం గ్, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, పోషకాహారం, వ్యాయామం, చికిత్స సమయంలో, తరువాత సమగ్ర శ్రేయస్సుపై మహిళలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని ‘పింక్ పవర్‘ అనే పుస్తకాన్ని రచించారు.

ఈ పుస్తకాన్ని ఆదివారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సినీ నటి శ్రీలీల హాజరై యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జిఎస్ రావుతో కలిసి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళల్లో అత్యంత సాదారణంగా వచ్చే క్యాన్సర్ల లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్‌సీఆర్పీ) నుండి వచ్చిన తాజా గణాంకాల ప్రకారం భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మొత్తం క్యాన్సర్లలో 27 వరకు ఉంది.

రొమ్ము క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల దాని పెరుగుదల యొక్క ఉన్నత దశలలో చికిత్సా చాలా కష్టమవుతుంది. 50% కంటే ఎక్కువ మంది భారతీయ మహిళలలో రొమ్ము క్యాన్సర్ 3-4 దశలో మాత్రమే బయటపడుతుంది. దీనికి ప్రధాన కారణం రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో సరైన అవగాహన లేకపోవడమే” అని అన్నారు. కొంత అవగాహనతో స్త్రీలు తమ పరిస్థితిని స్వీయ-నిర్ధారణ చేసుకోవచ్చు అందుకు డాక్టర్ రాజేష్ గౌడ్, రచిం చిన ‘పింక్ పవర్‘ అనే ఈ పుస్తకం రొమ్ము క్యాన్సర్ పై అవగాహనకు గొప్ప సహాయక వ్యవస్థ అని, మంత్రి సీతక్క తెలిపారు.

‘అధునాతన శస్త్రచికిత్సలతో ఇప్పుడు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి సమర్ధవంతమైన చికిత్సలు మనకు అందుబాటులోనే ఉన్నాయి. క్యాన్స ర్ వ్యాధిని జయించవచ్చు ఇందుకు క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం కీలకం నమ్మకం కోల్పోవద్దు. మహిళల సంక్షేమం కోసం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని యశోద హాస్పిటల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది” అని సినీ నటి శ్రీలీల తెలిపారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా, డాక్టర్. రాజేష్ గౌడ్ సమగ్రమైన ఆధారాల, ఆధారితంగా రచించిన ‘పింక్ పవర్‘ అనే పుస్తకం సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో వ్రాయబడింది. బహుళ భారతీయ భాషలలో అందు బాటులో ఉంది.

‘రొమ్ము క్యాన్సర్‘ అనే పేరు చుట్టూ ఉన్న కళంకం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎవరికైనా ఆశను కల్పిస్తుందని యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. రావు అన్నారు. డాక్టర్ రాజేష్‌గౌడ్ మాట్లాడుతూ.. “చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ అనగానే వారి రొమ్ము గుర్తింపును కోల్పోవడం అని భయపడుతున్నారు. అది ఇకపై నిజం కాదు. లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీతో అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికి త్సలు చేయవచ్చు. ముందస్తు రోగ నిర్ధారణ, అధునాతన ఆంకోప్లాస్టిక్ రొమ్ము శస్త్రచికిత్సలతో, క్యాన్సర్ ఫలితాలతో రాజీ పడకుండా మనం రొమ్మును కాపాడుకోవచ్చు మరియు స్త్రీ గౌరవాన్ని కాపాడుకోవచ్చు” అని  తెలిపారు.