calender_icon.png 27 October, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొటానికల్ గార్డెన్‌లో పింక్ పిక్నిక్

27-10-2025 12:00:00 AM

-రొమ్ము క్యాన్సర్‌పై కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం 

-వెయ్యి మందికి పైగా హాజరైన మహిళలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మహిళలకు వచ్చే పలు రకాల క్యాన్సర్ల గురించి అవగాహన కల్పించేందుకు నగరంలోని బొటానికల్ గార్డెన్స్ లో పింక్ పిక్నిక్ పేరుతో వైవిధ్యమైన కార్యక్రమాన్ని ఆదివారం కిమ్స్ గచ్చిబౌలి ఆస్పత్రి ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా కేవలం అవగాహన కార్యక్రమాలు మాత్రమే కాకుండా పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. యోగా, డైట్, సౌండ్ థెరపీ, డాన్స్ లాంటి పలు రకాల స్టాల్స్ ఇందులో ఉన్నాయి. వీటితోపాటు బ్రెస్ట్ సెల్స్ పరీక్షలు కూడా ఒక స్టాల్లో నిర్వహించారు. మహిళలు ఎవరికి వారే ఈ పరీక్ష చేసుకునేలా అక్కడున్న వాలంటీర్లు శిక్షణ ఇచ్చారు. పలు రకాల స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు.. మహిళలకు ఉపయోగపడే పలు రకాల అంశాలను ఇక్క డ ఏర్పాటు చేశారు.

అందులో అన్నింటికం టే విభిన్నంగా ఉన్నవి.. సర్వైకల్ క్యాన్సర్కు స్వీయ పరీక్ష కిట్లు. గుజరాత్‌కు చెందిన అయోటా అనే సంస్థ ఈ ఎం-కిట్‌ను రూ పొందించింది. రుతుస్రావం సమయంలో ఉపయోగించే శానిటరీ నాప్కిన్ల మీద ఉండే రక్తం మీద ఈ స్ట్రిప్ పెడితే చాలు. వీటిద్వారా ఎవరికి వారు స్వీయ పరీక్ష చేసుకోవచ్చు. దీంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉం దో లేదో తెలుస్తుంది. ఇంతవరకు ఇలాంటి పరీక్షలకు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది.

అం దుకు చాలామంది వెనకాడడంతో ఇప్పుడు ఈ కిట్లను రూపొందించి ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా మహిళల కోసం కస్టమైజ్డ్ బ్రాసరీలు రూపొందించే ఒక బెంగళూరు సంస్థ కూడా తమ స్టాల్‌ను ఏర్పాటుచేసింది. గతం లో రొమ్ముక్యాన్సర్ బారిన పడి, శస్త్రచికిత్స, ఇతర చికిత్సలు చేయించుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్న పలువురు మహిళలు ఇక్కడకొచ్చి, తమ విజయగాధలను వివరించారు.

కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డా. భాస్కర్‌రావు, గచ్చిబౌలి యూనిట్ రిజనల్ డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, కిమ్స్ గచ్చిబౌలి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అంకితా చావ్లా, ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పవన్ జొన్నాడ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బాయన భవ్య, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్  డాక్టర్ మేకల లక్ష్మారెడ్డి, కన్సల్టెంట్ మైక్రోవాస్క్యులర్, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ వి.ప్రజ్యోత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.