02-01-2026 01:05:08 AM
వికారాబాద్, జనవరి 1: ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ట్రస్మా 2026 సంవత్సరం క్యాలెండర్ ను గురువారం వికారాబాద్ లోని శ్రీ వివేకవాణి విద్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్మా స్టేట్ కోరు కమిటీ మెంబర్ ఎం.నాగయ్య మాట్లాడుతూ ప్రతి కొత్త సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్ కు అంతా మంచి జరగాలని, యాజమాన్యాలు ఆర్థికంగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అన్ని ఒకే తాటిపై ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఈ సందర్భంగా ట్రస్మా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మద్దూర్ పాషా, ట్రెజరరీ సుధీర్ తో పాటు వికారాబాద్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సభ్యులు, కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.