calender_icon.png 28 July, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్, గ్రామ పరిపాలన అధికారి పరీక్షలు

28-07-2025 12:11:03 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూలై 27 (విజయక్రాంతి) : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం అమలు లో భాగంగా అధికార వికేంద్రికరణ ద్యేయంగా,  గ్రా మాలలో  భూ సమస్యలను పరిష్కరించుట కొరకు లైసెన్స్ సర్వేయర్, గ్రామానికి ఒక రెవిన్యూ అధికారిని నియమించేందుకు నిర్వ హించిన పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ప్రశాంతంగా ముగిసినట్లు  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.

ఆదివారం పట్టణంలోని ఎస్ వి డిగ్రీ కాలేజ్ లో జరిగిన లైసెన్స్ సర్వేయర్, గ్రామ పరిపాలన అధికారి పరీక్షలను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్ పరీక్షకి 238 మందికి గాను 195 మంది  హాజరయ్యారన్నారు. అలాగే గ్రామ పరిపాలన అధికారి పరీక్షకి 80 మందికిగాను 77 హాజరయినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం లో  డి ఆర్ డీ ఓ వి.వి.అప్పారావు, ఎడి ఎస్ ఎల్ ఆర్.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వేణుమాధవరావు, సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, తహసీల్దార్ కృష్ణయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.