28-07-2025 12:10:23 AM
- గ్రామాల్లో వీడీసీ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం
- ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, జూలై 2౭ (విజయక్రాంతి): రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో అక్రమ రవాణాలు అడ్డుకడుతూ, ఎప్పటికప్పుడు శాంతిభద్రతలపై సరిహద్దు మండల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. తెలంగాణ- సరిహద్దులోని జైనథ్ మండలంలో ఆదివారం ఎస్పీ పర్యటించారు.
ఈ సందర్భంగా భారీ వర్షాలు నేపథ్యంలో చనాక- కోరాట బ్యారేజ్ ను ఎస్పీ సందర్శించారు. అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా బ్రిడ్జి వద్ద నది ప్రవాహాన్ని పరిశీలించి, నదిలో యువత ఈతకు వెళ్లకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, బ్రిడ్జిలపై నుండి వరదలు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటవద్దని, వాగులు వంకలు పొంగిపొర్లుడుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
అనంతరం మండలంలోని కోరాట, గిమ్మ, తర్నం గ్రామా ల్లో నిర్వహించిన పోలీసు మీ కోసం కార్యక్రమాల్లో ఎస్పీ పాల్గొని ప్రజలు, యువకు లకు పలు అంశాలపై చైతన్య పరిచారు. యువత చదువుతోపాటు క్రీడారంగంలో అభివృద్ధి చెం దాలని మూడు గ్రామాల యువతకు మూడు వాలీబాల్ స్పోరట్స్ కిట్స్ అందజేసి ప్రోత్సహించారు. అదేవిధంగా సరిహద్దులో ఉన్నందున అక్రమంగా దేశీదారు, గంజాయి తరలించకుండా, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ప్రజలు జిల్లా పోలీసు యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు.
గ్రామాలలో వీడీసీ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని, విడిసిల ద్వారా ఎలాం టి అక్రమ పరిస్థితులు నెలకొన్న వాటిపై జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. అలాగే యువతకు విద్యార్థులకు చదువు ప్రాధాన్యతను తెలియజేసి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశ గా కృషి చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా యువత విద్యార్థులు జలపాతాలు, నదులు వాగుల వద్ద జాగ్రత్తలు వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్త్స్ర గౌతమ్, ఆయా గ్రామాల పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.