10-09-2025 12:37:12 AM
- ఎస్ డి ఆర్ హెచ్ బృందం సహాయక చర్యల పర్యవేక్షణ
- రూ.7 కోట్లతో నూతన భవనానికి ప్రతిపాదనలు
- ప్రమాదకరమైన భవనాల వైపు విద్యార్థులు వెళ్లకుండా కౌన్సిలింగ్
- అందుబాటులో ఉన్న సురక్షితమైన గదుల్లో తరగతులు, హాస్టల్ ఏర్పాటు
- కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి)/ మునిపల్లి :మునిపల్లి మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ యొక్క పాత డార్మిటరీ బ్లాక్ మంగళవారం మధ్యాహ్నం కూలిన ఘటనలో వి ద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన కలెక్టర్ లింగంపల్లి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు.
ఈ సం దర్భంగా పాఠశాలలో ఎస్ డి ఆర్ హెచ్ బృందం చేపట్టిన సహాయక చర్యలను కలెక్టర్ పర్యవేక్షించారు. తెలంగాణ రెసిడెన్షియ ల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న లింగంపల్లి గురుకుల పాఠశాలలో 1984లో నిర్మించిన పాత హాస్టల్ భవనం లో మంగళవారం మధ్యాహ్నం గోడ కూలిన ఘటన చోటుచేసుకుంది . విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ప్రావిణ్య హుటాహుటిన గు రుకుల పాఠశాలకు చేరుకున్నారు.
గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు సుమారు 601 మంది విద్యార్థులు చదువుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా తరగతి గదిలో ఉండడంతో పెద్ద ప్ర మాదం తప్పిందన్నారు. ఆ సమయంలో హా స్టల్ భవనం పక్కగా వెళుతున్న ముగ్గురు విద్యార్థులకు ఈ ఘటనలో స్వల్పంగా గా యాలయ్యాయని, వారికీ జహీరాబాద్ ఏరి యా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
సహాయక చర్యల్లో ఎస్డీఆర్‌ఎఫ్ బృందం..
పాఠశాలలో ఎస్డిఆర్‌ఎఫ్ బృందం కూ లిన మట్టి తోలగింపు మట్టి శిఖరాల కింద ఉన్న విద్యార్థుల ట్రంకు బాక్సులు వ్యక్తిగత సామాగ్రిని సురక్షితంగా బయటకు తీస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ప్రమాదకరమైన శిథిలావస్థకు చేరిన భవనాల వద్దకు వెళ్లకుండా కౌన్సిలింగ్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు తాత్కాలికం గా వసతికి ఎలాంటి ఇబ్బందులు లేవని, అందుబాటులో ఉన్న తరగతి గదులు, హా స్టల్ గదుల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇంజనీరింగ్ శాఖ (ఈ ఈ డబ్ల్యూ ఐ డి సి) అధికారులు సంఘటనా స్థ లంలో పాడైన భవనాలను కూల్చివేయడం , వినియోగించటానికి వీలుగా వుండే గదుల కు తక్షణ మరమ్మతులు చేపట్టడం లాంటి కా ర్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రాత్రి స మయంలో పనులు కొనసాగేందుకు తాత్కాలికంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
గురుకుల పాఠశాలకు నూతన హాస్టల్ భవన నిర్మాణం కోసం రూ .7 కోట్లతో ప్రభుత్వానికి ఆమోదం కోసం ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పాఠశాలల్లో పరిస్థితి పూ ర్తిగా అదుపులో ఉందని విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.