calender_icon.png 21 November, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.4 లక్షల విలువైన మద్యం పట్టివేత

16-08-2024 02:33:48 AM

హనుమకొండ, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం రోజు నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయించిన బెల్ట్‌షాపులపై గురువారం వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి రూ.4 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు.. టాస్క్‌ఫోర్స్, మిల్స్‌కాలనీ పోలీసులు శాకరాసి కుంటలోని ఎనగందుల రాజు అలియస్ జింబాంబే రాజుకు చెందిన బెల్ట్ షాపుపై దాడి చేశారు. షాప్‌లో రూ.2,86,590 విలువ గల మద్యం సీజ్ చేశారు. అనంతరం సుబేదారి పోలీసులతో కలిసి వడ్డెపల్లిలోని మిట్లపల్లి రమాదేవి నిర్వహిస్తున్న బెల్ట్‌షాపుపై దాడి చేశారు. రూ.50,130 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. వడ్డెపల్లి ముదిరాజ్ కాలనీలోని పెసరు రాజ్‌కుమార్ బెల్టుషాపుపై దాడి చేసి రూ. 77,830 విలువ గల మద్యం సీజ్ చేశారు.