08-11-2025 12:00:54 AM
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, నవంబర్ 7 (విజయక్రాంతి)జిల్లా లో ఉచిత చేప పిల్లల విడుదల కా ర్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఘనపూర్, గండి రామరము రిజర్వాయర్ లో జరిగిన ఈ కార్యక్ర మం సందర్భంగా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంద న్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా ఏటా సు మారు నాలుగు వందల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని.. దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన చేపలు మార్కెట్లోకి వస్తున్నాయి అని తెలిపారు.
మత్స్య కారుల ఆదాయం పెరగడం కోసం చేపలను పెంచడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పించేలా అధికారులను సూచించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఘనపూర్ రిజర్వాయర్ పరిధిలో 319 మహిళా సంఘాల సభ్యులు, 700 మంది మత్స్యకార సంఘ సభ్యులు, మరో 300 మంది సభ్యత్వం కోసం అప్లై చేసుకున్నారని. మొత్తం 1300 మంది మత్స్యకారులు నెలకు పదివేల రూపాయలకు పైగా సంపాదించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొ న్నారు.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ మాట్లాడుతూ.. జిల్లా లోని మొత్తం 736 చెరువులు, 9 రిజర్వాయర్ లలో 2 కోట్ల 72 లక్షల చేప పిల్లల విడుదల లక్ష్యం కాగా ఈరోజు లాంచనం గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. మొత్తం ప్రక్రియ ఈ నెల ఆఖరి వరకు పూర్తి అవుద్దన్నారు.ఈ చేప పిల్లల విడుదల వల్ల 190 మత్స్యకారుల సహకార సంఘాల్లోని 19 వేల సభ్యులతో పాటు వీరి మీద ఆధార పడిన దాదాపు 80 వేల మత్స్య కార్మికుల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు.ఇక్కడ ఉత్పత్తి అయ్యే చేపలను డిమాండ్ ఎక్కువగా ఉండే ఇతర రాష్ట్ర ప్రాంతాలకు కూడా మార్కెటింగ్ చేసి అధిక లాభాలను పొంది ఆర్ధికంగా అభివృ ద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్డీ ఓ వెంకన్న, జిల్లా మత్స్య శాఖ అధికారి రా నా ప్రతాప్, డీపీవో, తహసీల్దార్ జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.